గిరిజన జాతులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-20T06:42:05+05:30 IST

గిరిజన తెగలు వాల్మీకి, భగత, గౌడ కులాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి తొలగింపునకు బాధ్యులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.ధర్మన్నపడాల్‌, జీవో- 3 సాధన కమిటీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.నారాయణరాజు తెలిపారు.

గిరిజన జాతులను వెబ్‌సైట్‌ నుంచి తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు
ఎస్టీ తెగలను వెబ్‌సైట్‌ నుంచి తొలగింపుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్న నాయకులు.


జి.మాడుగుల, అక్టోబరు 19: గిరిజన తెగలు వాల్మీకి, భగత, గౌడ కులాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ల నుంచి తొలగింపునకు బాధ్యులపై చర్యలు చేపట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్‌.ధర్మన్నపడాల్‌, జీవో- 3 సాధన కమిటీ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.నారాయణరాజు తెలిపారు. గిరిజనుల్లో చిచ్చురేపి గిరిజన సంపదను దోచుకోవాలన్న దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌సైట్‌ల నుంచి ఒక్కొక్క కులాన్ని తొలగిస్తున్నదన్నారు.  గిరిజన జాతులను వెబ్‌సైట్‌ నుంచి తొలగిస్తున్న వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సింహాచలంనాయుడు, లక్ష్మీనాయుడు, తిలక్‌నాయుడు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-20T06:42:05+05:30 IST