Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోటాపోటీగా టీడీపీ, వైసీపీ దీక్షలు

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో  రెండోరోజు శుక్రవారం పోటాపోటీగా టీడీపీ, వైసీపీ శ్రేణులు దీక్షలు నిర్వహించాయి. శ్రీకాకుళంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. పార్టీ కార్యాలయాలపై దాడులు చేపట్టడం వైసీపీ సర్కారుతోనే ప్రారంభమైందని ఆమె ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు జనాగ్రహ దీక్ష చేపట్టారు. చంద్రబాబునాయుడు నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ధర్మాన  ప్రసాదరావు ఆరోపించారు. పలాస-కాశీబుగ్గలో పశుసంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, నరసన్నపేటలో ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, ఇతర నియోజకవర్గాల్లో ఆయా పార్టీల నేతలు జనాగ్రహ దీక్ష చేపట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు.  


TAGS: tdp YCP

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement