పోటాపోటీగా..

ABN , First Publish Date - 2022-05-28T04:46:29+05:30 IST

పోటాపోటీగా..

పోటాపోటీగా..
టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అదుపు చేస్తున్న పోలీసులు


  • టీపీసీసీ అధ్యక్షుడి దిష్టిబొమ్మ దహనం చేసిన  టీఆర్‌ఎస్‌ నాయకులు
  • కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల నినాదాల హోరు
  • చౌదరిగూడలో ఉద్రిక్తత

ఘట్‌కేసర్‌, మే27 : టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలకు దిగడంతో శుక్రవారం చౌదరిగూడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈనెల 23 లక్ష్మాపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ రచ్చబండ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలతో ప్రారంభమైన వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. గురువారం చౌదరిగూడలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేయగా, శుక్రవారం టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయాలని టీఆర్‌ఎస్‌ మండల పార్టీ నిర్ణయం తీసుకుంది. విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు సైతం నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పెద్దఎత్తున ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. ఇంతలో టీఆర్‌ఎస్‌ నాయకలు రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్‌ కార్యక్తలకు సమీపంలో దహనం చేయడం ప్రారంభించారు. టీఆర్‌ఎ్‌సకార్యక్తలు రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌ కార్యకర్తలు మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇద్దరు ఎస్‌ఐలు అదనపు బాలగాలతో కాంగ్రెస్‌ కార్యకర్తలను చుట్టుముట్టి కదలకుండా నియంత్రించారు.టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లి పోవడంతో వివాదం సద్దుమనిగింది. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలఅధ్యక్షుడు నాగులపల్లి రమేష్‌, ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి, సర్పంచులు బైరు రమాదేవి, ఒరుగంటి వెంకటేష్‌ గౌడ్‌, ధర్మారెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, బస్వరాజ్‌, దుర్గరాజ్‌, శ్రీనివాస్‌, సంతోష్‌, నర్సింహ, సందీ్‌ఫరెడ్డి, నాగరాజు, స్వామిదాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు తొత్తులుగా వ్యవహస్తున్నారని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపించారు. ఎంపీ రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న అడ్డుకోకుండా పోలీసులు కాంగ్రెస్‌ కార్యకర్తలను మాత్రం నియంత్రించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు పోలీసుల అండదండలతో నిరసనలు చేయడం వారి దిగజారుడు రాజకీయలకు నిదర్శనం అని అంజనేయులు గౌడ్‌, భాస్కర్‌రెడ్డి, బాబురావు, బోజిరెడ్డి, వినోద్‌, నర్సింగ్‌రావు, అనిల్‌ అరోపించారు.

Updated Date - 2022-05-28T04:46:29+05:30 IST