దళిత బంధు నిలిపివేతతో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రగడ

ABN , First Publish Date - 2021-10-19T08:22:07+05:30 IST

దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య గొడవ మొదలైంది.

దళిత బంధు నిలిపివేతతో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య రగడ

పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనం

హుజూరాబాద్‌ రూరల్‌: దళిత బంధు పథకం అమలును నిలిపివేయాలంటూ ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య గొడవ మొదలైంది.  దళిత బంధు అమలును బీజేపీయే నిలిపివేయించిందని ఆరోపిస్తూ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సోమవారం రాత్రి ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా దిష్టిబొమ్మలను దహనం హుజూరాబాద్‌ పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద ఈటల రాజేందర్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్‌ దిష్టిబొమ్మను దహం చేస్తుండగా టీఆర్‌ఎస్‌ నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. మరోవైపు కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌, కమలాపూర్‌, మర్రిపల్లిగూడెం గ్రామాల్లో దళితులు రాస్తారోకో చేశారు. బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం వల్లే ఎన్నికల కమిషన్‌ దళితబంఽధ పథకాన్ని నిలిపివేసిందని ఆరోపించారు. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని పథకాన్ని యథావిధిగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే దళితవాడల్లోకి బీజేపీ నేతలను రానివ్వబోమని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-19T08:22:07+05:30 IST