కరోనాపై విద్యార్థులకు పోటీలు

ABN , First Publish Date - 2020-03-29T11:21:27+05:30 IST

కరోనా వైర్‌స నివారణ చర్యలపై పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పలు రకాల పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ

కరోనాపై విద్యార్థులకు పోటీలు

ఆన్‌లైన్‌లో నిర్వహణకు ఆదేశాలు


నెల్లూరు (విద్య) మార్చి 28 : కరోనా వైర్‌స నివారణ చర్యలపై పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌లో పలు రకాల పోటీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ శేషగిరిబాబు ఆదేశించారు. 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు జూనియర్స్‌గా, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులు సీనియర్స్‌గా పరిగణించాలని తెలిపారు. వీరికి ఆన్‌లైన్‌ ద్వారా వ్యాసరచన, డ్రాయింగ్‌, ముగ్గుల పోటీలు నిర్వహించాలన్నారు. ఈనెల 28వ తేదీ నుంచి ఏప్రిల్‌ 14 వరకూ ఈ కార్యక్రమం కొనసాగించాలన్నారు. ఈ పోటీలకు విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.


వ్యాసరచనకు వైరస్‌  నివారణలో నా బాధ్యత, కుటుంబ, సామాజిక బాధ్యత అనే అంశం, డ్రాయింగ్‌లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, శానిటైజర్‌ల వినియోగం, ముగ్గుల పోటీల్లో బాలికలు ఆన్‌లైన్‌ ద్వారా వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక బాధ్యతకు సంబంధించిన ముగ్గులు కాగితంపై వేయాలన్నారు. ఈ పోటీలన్నీంటిలోనూ ఇంటి నుంచే విద్యార్థులు పాల్గొనాలన్నారు. దీనికి సంబంధించి డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్‌ ఎస్‌పీఎ్‌సనెల్లూరు డాట్‌ ఏపీ డాట్‌ జీఓవీ డాట్‌ ఇన్‌ శ్లాష్‌ స్టూడెంట్స్‌-కాంపిటీషన్‌ అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి విద్యార్థులు వివరాలు నమోదు చేయాలన్నారు. విద్యార్థులు తాము పాల్గొన్న పోటీ వివరాలు కాగితంపై రాసి ఫొటో తీసి వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. విజేతలకు జూనియర్స్‌ విభాగంలో ప్రఽథమ బహుమతి(ఒకరికి) రూ.5వేలు, ద్వితీయ(ఇద్దరికి) రూ.2,500లు, తృతీయ బహుమతి(నలుగురికి) రూ.1000లు, కన్సొలేషన్‌ బహుమతులు 50 మందికి రూ.500ల చొప్పును అందచేయాలన్నారు.


సీనియర్స్‌ విభాగంలో ప్రఽథమ బహుమతి(ఒకరికి) రూ.10 వేలు, ద్వితీయ(ఇద్దరికి) రూ.7,500లు, తృతీయ(నలుగురికి) రూ.5000లు, కన్సొలేషన్‌ బహుమతులు 50 మందికి రూ.1000ల చొప్పును అందచేయాలన్నారు. మరిన్ని వివరాలకు డీఈవో ఫోన్‌ 9849909109, ఎస్‌ఎ్‌సఏ ప్రాజెక్ట్‌ అధికారి, ఫోన్‌ 9849909132 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. 

Updated Date - 2020-03-29T11:21:27+05:30 IST