‘పల్లెపథం’ లఘుచిత్రాల పోటీ

ABN , First Publish Date - 2020-07-08T06:14:01+05:30 IST

పల్లె జీవనం, వ్యవసాయం, రైతు స్థితిగతులకు అద్దంపట్టే నేపథ్యంతో తీసిన లఘుచిత్రాల పోటీని ‘రైతు నేస్తం’ నిర్వహిస్తున్నది. వానల రాకతో సాగు మొదలైనా, పెరిగిన ఖర్చులు, అత్తెసరు మద్దతు ధరలతో అల్లాడుతున్న రైతును కరోనా మరింత నష్టపరుస్తోంది.

‘పల్లెపథం’ లఘుచిత్రాల పోటీ

పల్లె జీవనం, వ్యవసాయం, రైతు స్థితిగతులకు అద్దంపట్టే నేపథ్యంతో తీసిన లఘుచిత్రాల పోటీని ‘రైతు నేస్తం’ నిర్వహిస్తున్నది. వానల రాకతో సాగు మొదలైనా, పెరిగిన ఖర్చులు, అత్తెసరు మద్దతు ధరలతో అల్లాడుతున్న రైతును కరోనా మరింత నష్టపరుస్తోంది. ఈ నేపథ్యంలో, షార్ట్‌ఫిల్మ్‌ దర్శకులు, రచయితలు, కళాకారులు ఆకట్టుకొనే కథాంశం, సంభాషణలతో 14 నిముషాలకు మించని నిడివిగల లఘుచిత్రాలను ‘పల్లెనేస్తం’ పేరిట నిర్వహిస్తున్న ఈ పోటీకి జులై 31వ తేదీలోగా పంపవచ్చు. ఆగస్టు 15న ప్రకటించబోయే ఉత్తమమైన మూడు చిత్రాలకు వరుసగా లక్ష, 75వేలు, యాభైవేల రూపాయల నగదు పారితోషికం ఉంటుంది. మరిన్ని వివరాలకు www.rythunestham.in లేదా 9949094370, 9553825532 ఫోన్‌నంబర్లను సంప్రదించవచ్చు.

– డాక్టర్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు, సంపాదకులు, రైతునేస్తం

Updated Date - 2020-07-08T06:14:01+05:30 IST