Munugodu by poll ఇంచార్జ్ కోసం బీజేపీ నేతల మధ్య పోటీ

ABN , First Publish Date - 2022-08-18T17:25:20+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ కోసం బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. మునుగొడు బీజేపీ ఉప ఎన్నిక ఇంచార్జ్ రేసులో నలుగురు లీడర్లు ఉన్నారు.

Munugodu by poll ఇంచార్జ్ కోసం బీజేపీ నేతల మధ్య పోటీ

మునుగోడు: మునుగోడు ఉప ఎన్నిక (Munugodu by poll) ఇంచార్జ్ కోసం బీజేపీ నేతలు (BJP Leaders) పోటీ పడుతున్నారు. మునుగొడు బీజేపీ ఉప ఎన్నిక ఇంచార్జ్ రేసులో నలుగురు లీడర్లు ఉన్నారు. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jitender reddy), వివేక్ వెంకటస్వామి (Vivek venkat swamy), ఈటల రాజేందర్ (Etela rajender), మనోహర్ రెడ్డి (Manohar reddy) ఇంచార్జ్‌ కోసం పోటిపడుతున్నారు. అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ ఉప ఎన్నికకు ఇంచార్జ్ ఉంటే అమిత్ షా వద్ద పరపతి పెరుగుతుందని నేతల ఆలోచన. అమిత్ షా సభ తర్వాత నియోజకవర్గ ఇంచార్జ్ ప్రకటించే అవకాశం ఉంది.


ఇప్పటికే చౌటుప్పల్ ఎంపీపీతో పాటు పలువురు సర్పంచ్‌లను ఈటల రాజేందర్ బీజేపీలోకి తీసుకువచ్చారు. దుబ్బాక, హుజురాబాద్ సెంటిమెంటుతో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. అటు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలకు ఇంచార్జ్‌గా జితేందర్ రెడ్డి పని చేయగా... గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన అభ్యర్థిగా, స్థానిక నేతగా మనోహర్ రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డిని ఉప ఎన్నిక ఇంచార్జ్‌గా పెడితే బాగుంటుందని కమలనాథులు అంటున్నారు. అటు రాజగోపాల్ రెడ్డికి సన్నిహితుడిగా, అధిష్టానానికి రాష్ట్ర నాయకత్వానికి దగ్గరగా ఉన్న నేతగా వివేక్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. 

Updated Date - 2022-08-18T17:25:20+05:30 IST