Abn logo
Sep 21 2021 @ 01:20AM

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ: అసదుద్దీన్‌

అహ్మదాబాద్‌, సెప్టెంబరు 20: గుజరాత్‌లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎం పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ప్రకటించారు. ఇందుకోసం పార్టీ ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించిందని చెప్పారు. కాగా, అహ్మదాబాద్‌లోని సబర్మతి కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న యూపీ మాజీ ఎంపీ, గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ను కలవాలనుకున్న అసదుద్దీన్‌ ఒవైసీకి అధికారులు అనుమతి ఇవ్వలేదు.