నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తాం

ABN , First Publish Date - 2022-08-18T04:18:24+05:30 IST

పెద్దమండ్యం మండలం బండ్రేవు రెవి న్యూ గ్రామ పరిధిలో హంద్రీ-నీవా కాలువ నుంచి గండికోట రిజర్వాయర్‌ అనుసంధానంలో భాగంగా పైపులైన్‌ ఏర్పాటుకు భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తామని మదనపల్లి ఆర్డీవో మురళి తెలిపారు.

నిర్వాసితులందరికీ పరిహారం చెల్లిస్తాం
బండ్రేవు సమావేశంలో మాట్లాడుతున్న మదనపల్లి ఆర్డీవో మురళి

పెద్దమండ్యం, ఆగస్టు 17: పెద్దమండ్యం మండలం బండ్రేవు రెవి న్యూ గ్రామ పరిధిలో హంద్రీ-నీవా కాలువ నుంచి గండికోట రిజర్వాయర్‌ అనుసంధానంలో భాగంగా పైపులైన్‌ ఏర్పాటుకు భూమిని కోల్పోతున్న రైతులకు పరిహారం చెల్లిస్తామని మదనపల్లి ఆర్డీవో మురళి తెలిపారు. మండలంలోని బండ్రేవులో బుధవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడుతూ మందలవారిపల్లి, అవికేనాయక్‌ తండా, ధేనేనాయక్‌ తండా, ఫేకేనాయక్‌ తండా, దిగువపల్లి, వడ్డివంక తండా, బండేమ్మదిగువపల్లి ప్రాంతంలోని 95 మంది రైతులకు సంబంధించి 39.06 ఎకరాల భూమి సేకరించినట్లు వెల్లడించారు. వారందరికీ ఎకరా నికి రూ. 6 లక్షలు ఽప్రభుత్వం ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా భూముల్లో బోర్లు, చెట్లు, కట్టడాలకు ఆదనంగా చెల్లిస్తామన్నారు. రైతుల పూర్తి వివరాలను గ్రామసభలో తెలియ జేశారు. ప్రభుత్వం నిర్ణయించి ధరకు సమ్మతించిన రైతులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేయాలని కోరారు. పడమటి ప్రాంత రైతులకు నీటిని అందించే లక్ష్యంగా ఈ భూములు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. తహసీల్దార్‌ నిర్మలాదేవి, సర్పంచ్‌ భారతి, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్‌ మహేష్‌, డీటీలు సుబ్బయ్య,  పద్మనాభం, హంద్రీ-నీవా యూనిట్‌ కార్యాలయ సి బ్బంది రాజ్‌కుమార్‌, వీఆర్‌వో ఫక్రూషావలీ, జీఎస్‌ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2022-08-18T04:18:24+05:30 IST