పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-10-25T06:57:14+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయి అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరా కు రూ. 30వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి

టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబర్‌ 24: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయి అన్నదాతలు తీవ్ర ఆందోళనలో ఉన్నందున ప్రభుత్వం పంట నష్టపోయిన రైతులకు ఎకరా కు రూ. 30వేల పరిహారం ఇచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, రామడుగు మండలాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పార్లమెంట్‌ అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డితో కలిసి  విలేకరుల సమావే శంలో మాట్లాడారు.


ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోయినపుడు వారిని ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అయితే పంటల బీమా వల్ల కలిగే ప్రయోజనాలను సైతం రైతులు పొంద లేక పోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణ మని ఆరోపించారు. ఇప్పటి వరకు కనీసం పంట నష్టం కూడా అంచనా వేయలేదని, ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు కల్యా డపు ఆగయ్య, ఎడ్ల వెంకటయ్య, నాగుల బాలగౌడ్‌, దామెర సత్యం, సందబోయిన రాజేశం, వంచ శ్రీనివాస్‌రెడ్డి, షకీల్‌ అహ్మద్‌, రొడ్డ శ్రీధర్‌, పర్లపల్లి రవీందర్‌, సాయిల్ల రాజమల్లయ్య, జెల్లోజి శ్రీని వాస్‌, అవుదూర్తి విజయ్‌కుమార్‌, బసాలత్‌ మహ్మ ద్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 


రామడుగు : వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌ రమణ అన్నారు. వెదిరలో నష్టపోయిన పంట లను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు శంకర య్యతో పాటు పలువురు సన్నరకం వేయడంతో పూర్తిగా నష్టపోయామని తమను ఆదుకోవాలని గోడు వెల్లబోసుకున్నారు.  కార్యక్రమంలో టీడీపీ కరీంనగర్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి జంగం అంజ య్య, మండలాధ్యక్షుడు అమిరిశెట్టి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-25T06:57:14+05:30 IST