ఏలూరు ఘటనలో మృతుల కటుంబాలకు పరిహారం

ABN , First Publish Date - 2022-04-14T20:52:44+05:30 IST

ఏలూరు ఘటనలో మృతుల కటుంబాలకు పరిహారం ఇచ్చారు. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌ ప్రకటించారు.

ఏలూరు ఘటనలో మృతుల కటుంబాలకు పరిహారం

ఏలూరు: ఏలూరు ఘటనలో మృతుల కటుంబాలకు ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రభుత్వం తరపున రూ.25 లక్షల పరిహారం ఇస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రతాప్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు కంపెనీ తరపున రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, గాయపడినవారికి రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ప్రతాప్‌ తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని ప్రతాప్‌ పేర్కొన్నారు. మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో  ఐదుగురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 13 మందికి తీవ్రగాయాలు కాగా, పలువురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో విధుల్లో 17 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

Updated Date - 2022-04-14T20:52:44+05:30 IST