ఆ కంపెనీలో జాబ్ చేయాలంటే చోరీలు చేయడంలో అనుభవం ఉండాలి.. ఇంతకీ ఆ పని, జీతం ఎలా ఉంటుందంటే..

ABN , First Publish Date - 2022-03-12T22:03:21+05:30 IST

మీరు వింటున్నది నిజమే! చోరీలు చేస్తేనే ఈ కంపెనీలో జాబ్ ఇస్తారు. అక్కడ ఎలాంటి పని, జీతం ఎంత తదితర వివరాలతో పాటూ చివరికి ఆ కంపెనీ పరిస్థితి..

ఆ కంపెనీలో జాబ్ చేయాలంటే చోరీలు చేయడంలో అనుభవం ఉండాలి.. ఇంతకీ ఆ పని, జీతం ఎలా ఉంటుందంటే..
ప్రతీకాత్మక చిత్రం

మంచి మంచి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎంతో మంది అమాయకులను మోసం చేసే వాళ్లను తరచూ చూస్తుంటాం. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ పోలీసులు తరచూ హెచ్చరిస్తున్నా.. ఇప్పటికీ ఎంతో మంది బాధితులు ఇలాంటి ముఠాల వలలో చిక్కుకుని మోసపోతుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కంపెనీలో ఉద్యోగం చేయాలంటే చోరీలు చేయడంలో అనుభవం ఉండాలి. మీరు వింటున్నది నిజమే! చోరీలు చేస్తేనే ఈ కంపెనీలో జాబ్ ఇస్తారు. అక్కడ ఎలాంటి పని, జీతం ఎంత తదితర వివరాలతో పాటూ చివరికి ఆ కంపెనీ పరిస్థితి ఏమైందనే వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి.. చోరీలకు అలవాటు పడ్డాడు. క్రమక్రమంగా ప్రోపెషనల్ దొంగలా మారిపోయాడు. అది ఎంతలా అంటే.. ఒక చేయి చేసే పని రెండో చేతికి కూడా తెలీనంతగా చోరీలు చేయడం ప్రారంభించాడు. నెలలో వీలైనన్ని చోరీలు చేసి.. పోలీసులకే చుక్కలు చూపించేవాడు. కొన్నాళ్లకు అతడికి విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఓ కంపెనీ పెట్టి, తానొక్కడే కాకుండా.. మరికొందరు దొంగలను తనతో కలుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. చోరీలు చేయడంలో చేయితిరిగిన వారిని ఎంచుకుని మరీ తన కంపెనీలో నియమించుకున్నాడు. దొంగల ప్రతిభ, పనితనాన్ని బట్టి జీతాలను ఫిక్స్ చేశాడు. దొంగల్లో కొందరిని గ్రూపులుగా విభజించి పని అప్పజెప్పేవాడు.

నీ ప్రవర్తన బాగోలేదన్న భర్త.. అయితే విడాకులు తీసుకోమన్న భార్య.. చివరకు ఏం జరిగిందంటే..



ఓ గ్రూపు దొంగలు రిక్షాలు, బైకులు, కార్లు తదితర వాహనాలను చోరీ చేసి, వాటి విడి భాగాలను పక్కకు తీస్తారు. మరో గ్రూపు దొంగలు.. వాహనాల బ్యాటరీలు, టైర్లు, ఇంజిన్లు తదితర విడిభాగాలను విక్రయిస్తారు. ఇలా ఈ దొంగలు ఎన్నో వాహనాలను చోరీ చేసి, విక్రయించినట్లు తెలిసింది. వీరి గురించి సమాచారం అందుకున్న పోలీసులు..  ఇర్ఫాన్‌తో సహా మిగతా దొంగలందరినీ అరెస్ట్ చేశారు. ఈ దొంగలకు వారి టాలెంట్‌ని బట్టి రూ.30వేల వరకు జీతాలు ఇచ్చేవాడని పోలీసు విచారణలో తెలిసింది. వీరిలాగానే 2018లో ఓ వ్యక్తి కూడా కంపెనీ పెట్టి, చోరీలు చేయించినట్లు పోలీసులు తెలిపారు.

‘‘నా భర్త కిందపడిపోయాడు.. కాపాడండి’’ అంటూ కేకలు.. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన యువకుడు.. పోలీసుల విచారణలో ఏం తెలిసిందంటే..

Updated Date - 2022-03-12T22:03:21+05:30 IST