ఆఫీసుకి వస్తే గానీ... ఉద్యోగి పనిచేసినట్టు కాదు... సాధారణంగా చాలా కంపెనీలు ఇలాగే భావిస్తాయి. కానీ నిన్నటివరకూ ఇదే ధోరణిలో ఉన్న కంపెనీలు... ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్‌కే ప్రయారిటీ ఇస్తున్నాయట. చిత్రమేంటంటే - రేపు వైరస్ తగ్గి, సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ - వర్క్ ఫ్రమ్ హోమ్ పద్ధతినే కొనసాగిస్తాం అంటున్నాయట!