సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమాజ సేవ ముఖ్యం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమాజసేవ కూడా ఎంతో ప్రధానమని

సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమాజ సేవ ముఖ్యం

 జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ గోవర్దన్‌


పుల్‌కల్‌, మే 20: ప్రస్తుత సమాజంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సమాజసేవ కూడా ఎంతో ప్రధానమని జేఎన్టీయూహెచ్‌ రెక్టార్‌ ప్రొఫెసర్‌ గోవర్దన్‌ అన్నారు. చౌటకూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో వారం రోజులుగా కొనసాగుతున్న జాతీయస్థాయి సమైక్యతా శిబిరం శుక్రవారం ముగిసింది. కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ముగింపు వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలో అలవర్చుకున్న సేవాభావం ఎల్లకాలం గుర్తుండిపోతుందన్నారు. ఎన్‌ఎ్‌సఎస్‌ శిబిరాన్ని ఓ ఛాలెంజ్‌గా తీసుకుని, ఇక్కడ నేర్చుకున్న అంశాలను పది మందికి తెలియజేసి శిబిరం ఔన్నత్యాన్ని కాపాడాలని సూచించారు. శిబిరానికి వెళ్లామా..వచ్చామా అన్నది అంశం కాదని, వెళ్లి ఏం నేర్చుకున్నామన్నది ముఖ్యమన్నారు. తాము నేర్చుకున్న అంశాలపై చర్చలు జరిపి వాటిని విస్ర్తృత పర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  గౌరవ అతిథిగా హాజరైన జేఎన్టీయూహెచ్‌ ఓఎస్డీ ధర్మనాయక్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ జీఎన్‌.శ్రీనివాస్‌ విద్యార్థి వాలంటీర్లకు దిశా నిర్ధేశం చేశారు. ఎన్‌ఎ్‌సఎస్‌ జాతీయస్థాయి సమైక్యతా శిబిరం సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ కళాశాలలో నిర్వహించడం మర్చిపోలేని అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.  శిబిరం పురస్కరించుకుని నిర్వహించిన ప్రత్యేక తరగతులు విద్యార్థులకు ఎంతగానో దోహదపడుతాయన్నారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం (ఎన్‌ఎ్‌సఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరం ఈ నెల 14నుంచి 20 వరకు కొనసాగింది. దేశంలోని పది రాష్ర్టాల నుంచి 200 మంది విద్యార్థి వాలంటీర్లు తరలివచ్చి, సుమారు  150 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన కళాశాల ఆవరణలో శ్రమదానం, యోగా, వారివారి రాష్ట్రాల ప్రాంతీయ కళా ప్రదర్శనలు, ఆటపాటలు, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సుల్తాన్‌పూర్‌ జేఎన్టీయూ కళాశాల విద్యార్థుల కళాప్రదర్శన, బోనాల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారం రోజుల పాటు కొనసాగిన కార్యక్రమంలో విద్యార్థి వాలంటీర్లకు సమాజసేవ, ఔషధ మొక్కల పెంపకం-వాటి అవసరం, ఉపయోగించే విధానం, జీవన నైపుణ్యాలు, వ్యక్తిగత బంధాలు, యువత సాధికారత, జాతీయ సేవా పథకం (యన్‌ఎ్‌సఎ్‌స)లోని మెలకువలు వంటి అంశాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించారు. శిబిరానికి హాజరైన విద్యార్థులందరికీ ధ్రువపత్రాలను అందజేశారు. అనంతరం అతిథులను శాలువాలు, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎస్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, జేఎన్టీయూహెచ్‌ ఎన్‌ఎ్‌సఎస్‌ ప్రొగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.శోభారాణి, వైస్‌ ప్రిన్సిపాల్‌ జి.నర్సింహ్మ, కళాశాల ఎన్‌ఎ్‌సఎస్‌ కో ఆర్డినేటర్‌ రామ్‌నరేశ్‌యాదవ్‌, పీడీ దిలీ్‌పకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST