‘కమ్యూనిటీ ఫీడ్‌’ గూగుల్‌ కొత్త సహాయం

ABN , First Publish Date - 2020-12-05T05:40:34+05:30 IST

కొవిడ్‌ చిన్న వ్యాపారులను పెద్ద దెబ్బతీసింది. గూగుల్‌ మ్యాప్స్‌ వీరికి సహాయం చేసే పనిలో ఉంది. ప్రత్యేకంగా చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ముఖ్యంగా సరికొత్త వంటకాలు, వాటి అందుబాటు, సమయం తదితర వివరాలను ఎక్స్‌ప్లోర్‌ టాబ్‌లో ‘కమ్యూనిటీ ఫీడ్‌’ ఫీచర్‌ ద్వారా గూగుల్‌ తెలియజేయనుంది

‘కమ్యూనిటీ ఫీడ్‌’ గూగుల్‌ కొత్త సహాయం

కొవిడ్‌ చిన్న వ్యాపారులను పెద్ద దెబ్బతీసింది. గూగుల్‌ మ్యాప్స్‌ వీరికి సహాయం చేసే పనిలో ఉంది. ప్రత్యేకంగా చిన్న వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని స్థానికంగా లభ్యమయ్యే ఆహార పదార్థాలు ముఖ్యంగా సరికొత్త వంటకాలు, వాటి అందుబాటు, సమయం తదితర వివరాలను ఎక్స్‌ప్లోర్‌ టాబ్‌లో ‘కమ్యూనిటీ ఫీడ్‌’ ఫీచర్‌ ద్వారా గూగుల్‌ తెలియజేయనుంది. ఆహారానికి సంబంధించిన సమీక్షలు, ఫుడ్‌ అందుబాటుకు సంబంధించి తాజాగా చోటుచేసుకున్న మార్పులు అంటే నిన్నమోన్నా ఏర్పాటైన షాప్‌ వివరాలు కూడా లభ్యమవుతాయి. దీనివల్ల చిన్న వ్యాపారులకు కొంతమేర అవకాశాలు పెరుగుతాయి. వీటితోపాటుగా గూగుల్‌ మ్యాప్‌లను కూడా మరింత మెరుగుపరిచే పనిలో ఉంది.

మార్గంలోని మలుపులను సైతం కలిపి బిల్డింగ్‌ నంబర్‌ సహా రూట్‌ మేప్‌లను కూడా ఉన్నతీకరిస్తోంది. మొత్తమ్మీద వినియోగదారులకు మరింతగా చేరువయ్యే ప్రయత్నంలో గూగుల్‌ ఉంది.

Updated Date - 2020-12-05T05:40:34+05:30 IST