Commonwealth Games: మరో రెండు పతకాలు ఖాయం చేసుకున్న భారత్

ABN , First Publish Date - 2022-08-02T00:56:33+05:30 IST

కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ఇండియా లాన్ బౌల్స్ మహిళల

Commonwealth Games: మరో రెండు పతకాలు ఖాయం చేసుకున్న భారత్

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌(Commonwealth Games)లో భారత్‌కు మరో పతకం ఖాయమైంది. ఇండియా లాన్ బౌల్స్ మహిళల బృందం న్యూజిలాండ్‌ను ఓడించి ఫోర్స్ లాన్ బౌల్స్(Fours Lawn Bowls)  పైనల్‌కు దూసుకెళ్లింది. ఫలితంగా కనీసం రజత పతకం భారత్ ఖాతాలో చేరినట్టే.  న్యూజిలాండ్‌ను 16-13తో ఓడించిన భారత బృందం బుధవారం దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో తలపడుతుంది. అందులోనూ విజయం సాధిస్తే భారత్ ఖాతాలో స్వర్ణం చేరుతుంది. ఓడినా రజతం దక్కుతుంది. ఈ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కానుంది. భారత మహిళల బృందానికి లవ్లీ చౌబే నాయకత్వం వహిస్తుండగా పింకీ, నయన్‌మోనీ, సాయికియా, రూపారాణి ఉన్నారు. 


భారత జుడోకా సుశీలా దేవి లిక్మాబమ్ (Shushila Devi) 48 కేజీల సెమీస్‌లో మారిషస్‌కు చెందిన ప్రిసిల్లా మోరాండ్‌ను ఓడించి కనీసం రజత పతకాన్ని ఖాయం చేసింది. భారత బాక్సర్ అమిత్ పంఘల్ ఫ్లైవెయిట్ కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాడు. వెయిట్‌లిఫ్టింగ్ 81 కేజీల విభాగంలో అజయ్ సింగ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం రెండు బంగారు పతకాలు గెలుచుకున్న భారత్ మరిన్ని పతకాలవైపు అడుగులు వేస్తోంది. ఇండియా ఇప్పటి వరకు మూడు పసిడి, రెండు రజతం, ఒక కాంస్య పతకంతో మొత్తం ఆరు పతకాలు సాధించింది. ఆదివారం జెరెమీ లాల్‌రినుంగా 67 కేజీల విభాగంలో, అచింత షూలి 73 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు అందించారు.  


Updated Date - 2022-08-02T00:56:33+05:30 IST