మరో రెండేళ్లు చుక్కల్లోనే కమోడిటీ ధరలు

ABN , First Publish Date - 2022-09-21T06:33:56+05:30 IST

రాబోయే రెండు, మూడు సంవత్సరాల వరకు కమోడిటీ ధరల కాటును ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థ లు సిద్ధంగా ఉండాలని హిందుస్తాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సీఈఓ, ఎండీ సంజీవ్‌ మెహతా సూచించారు.

మరో రెండేళ్లు చుక్కల్లోనే కమోడిటీ ధరలు

హెచ్‌యూఎల్‌ సీఈఓ సంజీవ్‌ మెహతా

న్యూఢిల్లీ: రాబోయే రెండు, మూడు సంవత్సరాల వరకు కమోడిటీ ధరల కాటును ఎదుర్కొనేందుకు వ్యాపార సంస్థ లు సిద్ధంగా ఉండాలని హిందుస్తాన్‌ యూనీలీవర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌) సీఈఓ, ఎండీ సంజీవ్‌ మెహతా సూచించారు. పలు ప్రపంచ పరిణామాల ప్రభావంతోనే ద్రవ్యోల్బ ణం అసాధారణ స్థాయిలకు పెరిగిపోయిందని.. అలాగే ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం మరింతగా సరఫరా అంతరాయాలకు కారణమైందన్నారు. ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్తుందో చెప్ప డం కష్టమని చెబుతూ మూడు రకాల వాతావరణం ఎదుర్కొనేందుకు కంపెనీలు సిద్ధం కావాలన్నారు. ద్రవ్యోల్బణం, స్వల్ప ప్రతి ద్రవ్యోల్బణం ఒకటైతే ఎంత స్థాయికైనా పెరిగిపోయే ద్రవ్యోల్బణ స్థితి రెండోదని, భారీగా పడిపోయే కమోడిటీ ధరలను ఎదుర్కొనాల్సిన పరిస్థితి మూడోదన్నారు. 

Updated Date - 2022-09-21T06:33:56+05:30 IST