Abn logo
Apr 13 2021 @ 00:13AM

అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు కమిటీలు

సబ్బవరం, ఏప్రిల్‌ 12: మండలంలోని అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఎంపీడీవో రమేశ్‌నాయుడు ఆధ్వర్యంలో సోమవారం కమిటీలు ఏర్పాటు చేశామని సీడీపీవో కేఎల్‌ఆర్‌కే కుమారి తెలిపారు. కన్వీనర్‌గా సీడీపీవో, సభ్యులుగా ఎంపీడీవో, హౌసింగ్‌ ఏఈ మల్లునాయుడు, ఆర్‌డబ్య్లూఎస్‌ ఏఈ హిమబిందు, ట్రాన్స్‌కో ఏఈ ఎ. కృష్ణ ఉంటారన్నారు. మూడు అంగన్‌వాడీ భవన నిర్మాణాలకు, 11 కేంద్రాల అప్‌గ్రెడేషన్‌కు ఎంపిక చేశామన్నారు. ఈ పనులన్నింటినీ కమిటీ పర్యవేక్షిస్తుందని వివరించారు. తల్లీ పిల్లల పోషణ, ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచడంలో భాగంగా నాణ్యమైన ప్రీ ప్రైమరీ విద్యను బలోపేతం చేసేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రీ ప్రైమరీ స్కూలల్సగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఎంపీడీవో రమేశ్‌నాయుడు తెలిపారు. ఈ మేరకు మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా భాగస్వామ్యంతో అభివృద్ధికి కమిటీలను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement