Abn logo
Oct 27 2021 @ 23:59PM

నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి కమిటీ

మాట్లాడుతున్న జేసీ అంబేడ్కర్‌

బుట్టాయగూడెం, అక్టోబరు 27: పునరావాస కాల నీల్లో మౌలిక వసతులతో పాటు కాలనీ వాసుల సమస్యలు పరిష్కరిస్తామని జేసీ డాక్టరు బీఆర్‌ అంబేడ్కర్‌ తెలిపారు. పోలవరం నిర్వాసితుల సమ స్యల పరిష్కారానికి సర్పంచ్‌లు, అఽధికారులతో ప్రాజెక్టు లెవల్‌ మోనిటరింగ్‌ కమిటీ (పీఎల్‌ఎంసీ) సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. బుధవారం ఐటీడీఏలో జరిగిన పీఎల్‌ఎంసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజి అమలు పీఎల్‌ఎంసీ  సమావేశం ముఖ్య ఉద్దేశమన్నారు. కమిటీ సభ్యులు లిఖిత పూర్వకంగా సమస్యలు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.    సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను ప్రభుత్వానికి మినిట్స్‌ రూపంలో పంపుతామని పీవో ఆనంద్‌ తెలిపారు.  ఆర్డీవో ప్రసన్నలక్ష్మి,  గిరిజన ప్రతినిధులు, సర్పంచ్‌లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.