అమరావతి: సినిమా టికెట్ల ధరలపై ఫిబ్రవరి 2న కమిటీ భేటీ కానుంది. సమావేశానికి చిరంజీవిని ఆహ్వానించే అవకాశం ఉంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినిగ్రోయర్స్ సభ్యులకు ఆహ్వానం పంపారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశం జరిగింది. ఇటీవల లంచ్ భేటీలో కమిటీతో సమావేశమవుదామంటూ సీఎం వెల్లడించినట్టు చిరంజీవి పేర్కొన్నారు. సినిమా టికెట్ ధరలపై ఫిబ్రవరి 10న హైకోర్టులో విచారణ జరుగనుంది. కరోనా సోకడంతో సమావేశానికి చిరంజీవి హాజరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి