Abn logo
Sep 25 2021 @ 23:07PM

నిబద్ధత గల కమ్యూనిస్టు ఎ.బి.బర్దన్‌

బర్దన్‌ చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న పార్టీ నాయకులు

రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి 

అల్లిపురం, సెప్టెంబరు 25: నిబద్ధత, విలువలతో కూడిన దార్చనికత సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి దివంగత ఎ.బి.బర్ధన్‌ గొప్పతనమని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు.  బర్దన్‌ 97వ జయంతి సందర్భంగా అల్లిపురంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.


ఈ సందర్భంగా  సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వామపక్ష భావజాలం వైపు ఆకర్షితుడైన బర్దన్‌ తుదికంటూ పార్టీకోసం శ్రమించారన్నారు. ఐక్యపోరాటాలు, ఉద్యమాలతో నిరంతరం పనిచేశారని కొనియారు. ఆయన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి ఎం.పైడిరాజు,సహాయ కార్యదర్శి ఎస్‌.కె.రహమాన్‌, జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఎ.విమల, ఎం.మన్మధరావు, కాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు.