Abn logo
Jan 16 2021 @ 00:03AM

నాగోబాను దర్శించుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌

దివ్యదేవరాజన్‌కు నాగోబా చరిత్ర పుస్తకాన్ని అందజేస్తున్న నాయకులు

ఇంద్రవెల్లి, జనవరి 15: మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను గురువారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంందర్భంగా కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం రేణుకనాగనాథ్‌ పుష్పగుచ్ఛం అందజేసి శాలువో సన్మానించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీ చరిత్ర పుస్తకం అందించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు అర్క పుష్పలత, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం భీంరావు, మెస్రం తుకారం, అర్క ఖమ్ము, మెస్రం నాగ్‌నాథ్‌, మెస్రం ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement