భారీ వర్షాలు: అత్యవసరం కాని ప్రయణాలు వాయిదా వేసుకోవాలన్న సీవీ ఆనంద్

ABN , First Publish Date - 2022-07-10T22:59:58+05:30 IST

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని

భారీ వర్షాలు: అత్యవసరం కాని ప్రయణాలు వాయిదా వేసుకోవాలన్న సీవీ ఆనంద్

హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతేనే బయటకు రావాలని ప్రజలకు హైదరాబాద్ పోలీసులు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడంతో పోలీసులు ఈ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం కాని ప్రయాణాలకు ప్రజలు దూరంగా ఉండాలని సూచించారు. బయటికి వెళ్లే ముందు వాతావరణ శాఖ ప్రకటనలు తెలుసుకోవాలన్నారు.


మరోవైపు హైదరాబాద్‌ నగరంలో పోలీసులు రాత్రీపగలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ అధికారులను రాత్రి విధులకు నియమించారు. రెయిన్‌కోట్‌లు, బూట్లు, తాళ్లు, పంపులు ఇతర విపత్తు నిర్వహణ పరికరాలను సమకూర్చారు. GHMC, NDRF బృందాలతో కలిసి సమన్వయంతో పని చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసులకు సూచించారు. 

Updated Date - 2022-07-10T22:59:58+05:30 IST