నిర్లక్ష్యం పనికిరాదు

ABN , First Publish Date - 2021-10-27T04:43:43+05:30 IST

‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు, మీ ప్రాంతాలలో అపరిశుభ్రత కనిపిస్తే ఊరుకోను’ అంటూ కార్పొరేషన్‌ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు.

నిర్లక్ష్యం పనికిరాదు
రోడ్డుపై చెత్త కవర్లను తీస్తున్న కమిషనర్‌ దినేష్‌

సచివాలయ సిబ్బందిపై కమిషనర్‌ ఆగ్రహాం 

నెల్లూరు (సిటీ), అక్టోబరు 26 : ‘విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కుదరదు, మీ ప్రాంతాలలో అపరిశుభ్రత కనిపిస్తే ఊరుకోను’ అంటూ కార్పొరేషన్‌  కమిషనర్‌ దినేష్‌కుమార్‌ పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బందిని హెచ్చరించారు. క్లీన్‌ ఏపీ(క్లాప్‌) కార్యక్రమంలో భాగంగా మంగళవారం నగరంలోని కేవీఆర్‌ కూడలి నుంచి ఆర్టీసీ బస్టాండ్‌ వరకు రోడ్లపై చెత్తను తొలగించారు.  పారిశుధ్య సిబ్బంది, అధికారులతో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడక్కడ రహదారులు అపరిశుభ్రంగా కనిపించడంతో స్థానిక సచివాలయ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను పిలిచి ఇదేమిటంటూ ప్రశ్నించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించనన్నారు. అనంతరం కొన్ని దుకాణాల్లో ప్లాస్టిక్‌ కవర్ల వాడకంపై ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్‌వో వెంకట రమణయ్య పాల్గొన్నారు. 

స్కూళ్లు, కాలేజీల్లో తనిఖీలు 

నగరంలోని ప్రైవేట్‌ సూళ్లు, కాలేజీల్లో ఎంహెచ్‌వో వెంకట రమణయ్య బృందం మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. పారిశుధ్యం, కొవిడ్‌ నిబంధనలు, ట్రేడ్‌ లైసెన్సులు, శానిటేషన్‌ ధ్రువీకరణలపై ఆరా తీసింది. వాటర్‌ ట్యాంకులు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను పరిశీలించారు. కొన్ని సంస్థలకు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. నిర్ణీత వ్యవధిలో లోపాలను సరిచేసుకోకపోతే చర్యలు తప్పవని సూచించినట్లు తెలిసింది.

Updated Date - 2021-10-27T04:43:43+05:30 IST