ఎంపిక జాబితాలో పేర్లు సరిచూసుకోండి : కమిషనర్‌

ABN , First Publish Date - 2020-05-21T10:46:09+05:30 IST

నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికి ఇండ్లు’ పథకం కింద పట్టణ పరిధిలో 14827 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, దరఖాస్తుదారులు ఆ జాబితాలో తమ పేరు

ఎంపిక జాబితాలో పేర్లు సరిచూసుకోండి :  కమిషనర్‌

ప్రొద్దుటూరు క్రైం, మే 20 : నవరత్నాల్లో భాగంగా ‘పేదలందరికి ఇండ్లు’ పథకం కింద పట్టణ పరిధిలో 14827 మంది లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, దరఖాస్తుదారులు ఆ జాబితాలో తమ పేరు ఉందో లేదో  అయా సచివాలయాల్లో చూసుకోవాలని మున్పిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రాధ విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆమె తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభు త్వం ఉందన్నారు. ఆ జాబితాలో పేరు లేని నిరాశ చెందాల్సిన పనిలేదని, తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. ఇంటి నివేశస్థలం ఆర్జీతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పాస్‌పోర్టు సైజ్‌ ఫోటో, సెల్‌నెంబరును తెలియజేస్తూ, వారి వార్డుకు సంబంధించిన వార్డు సచివాలయాల్లో పనిదినాల్లో సమర్పించాలన్నారు. లేదా 9154565698 వాట్సప్‌ నెంబరుకు పైన పేర్కొన డాక్యుమెంట్లు జతచేసి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.  కాగా ప్రొద్దుటూరు పట్టణంలో రాబోయే వారం రోజుల్లో సడలింపులు వచ్చే అవకాశం ఉందని మున్పిపల్‌ కమిషనర్‌ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం కొత్తగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని, దాని ప్రకారం ఇకపై రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్‌ జోన్‌లాంటివి ఉండవని, వాటి స్థానంలో కంటోన్మెంట్‌, నాన్‌ కంటోన్మెంట్‌ అనే రెండు పద్దతులు మాత్రమే ఉంటాయన్నారు.  ఈ క్రమంలో పట్టణంలోని చాల ప్రాంతాలు నాన్‌ కంటోన్మెంట్‌ పరిధిలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అందులో భాగంగా మ్యాప్‌ను రూపొందిస్తున్నామని ఆమె స్పష్టం చేశారు. 

Updated Date - 2020-05-21T10:46:09+05:30 IST