రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST

రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి

రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలి
బషీరాబాద్‌ : తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న రేషన్‌ డీలర్లు


బషీరాబాద్‌/కొడంగల్‌ రూరల్‌/మోమిన్‌పేట, జూలై 4 : ఉద్యోగ భద్రతతో పాటు క్వింటాల్‌ బియ్యానికి కమీషన్‌ రూ.440 పెంచాలని డిమాండ్‌ చేస్తూ రేషన్‌ డీలర్లు సోమవారం బషీరాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో న్యాయమైన హక్కులను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. డీలర్ల హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంచాలని కొడంగల్‌ మండల డీలర్ల సంఘం ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రేషన్‌ డీలర్‌ వృత్తిలో కొనసాగుతున్నా తమకు కమీషన్‌ను పెంచడంలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో డీలర్లు నర్సిరెడ్డి, ప్ర భాకర్‌, పూరి శేఖర్‌, బోయిని కిష్టయ్య, వెంకటేశ్‌, వెంకట య్య, కిషన్‌సింగ్‌, రాములమ్మ, బాబు తదితరులు ఉన్నారు. 

  • ఉద్యోగ భద్రత కల్పించాలి

రేషన్‌ డీలర్లకు ఉద్యోగభద్రత కల్పించి, క్వింటాల్‌ బియ్యానికి కమీషన్‌ రూ.440కి పెంచాలని రేషన్‌ డీలర్ల సంఘం మోమిన్‌పేట మండల అధ్యక్షుడు సంగయ్య అన్నారు. సోమవారం మండలంలోని డీలర్లు తహసీల్దార్‌ కార్యాలయంలోని జూనియర్‌ అసిస్టెంట్‌కు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా సంగయ్య మాట్లాడుతూ డీలర్ల న్యాయపరమైన హక్కుల సాధనకు పోరాడుతూనే ఉంటామన్నారు. వీలైనంత త్వరగా డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరారు.డీలర్లు కిష్టయ్య, సురేశ్‌, మాణిక్యం, మల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, బుచ్చయ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-07-04T05:30:00+05:30 IST