రాజీవ్‌గాంధీ పార్కును నెలరోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలి: నగర కమిషనర్‌

ABN , First Publish Date - 2022-05-20T05:58:30+05:30 IST

రాజీవ్‌గాంధీ పార్కును నెల రోజుల్లో అన్ని హంగులతో ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

రాజీవ్‌గాంధీ పార్కును నెలరోజుల్లో   అందుబాటులోకి తీసుకురావాలి: నగర కమిషనర్‌

రాజీవ్‌గాంధీ పార్కును నెలరోజుల్లో 

అందుబాటులోకి తీసుకురావాలి: నగర కమిషనర్‌ 

చిట్టినగర్‌, మే 19: రాజీవ్‌గాంధీ పార్కును నెల రోజుల్లో అన్ని హంగులతో ఆధునికీకరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాజీవ్‌గాంధీ పార్కులో జరుగుతున్న పార్కు ఆధునికీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఆహ్లాదాన్ని అందించేలా పార్కును తీర్చిదిద్దాలని, ఆట పరికరాలతో పార్కును సుందరీకరించాలని ఆదేశించారు. ఆయా పనులు నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. సందర్శకులకు అందుబాటులో ఉండేలా క్యాంటీన్‌, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో ఈఈ ఏఎస్‌ఎన్‌ ప్రసాద్‌, ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-20T05:58:30+05:30 IST