కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.100 పెంపు

ABN , First Publish Date - 2021-12-01T19:11:47+05:30 IST

వ్యాపార ప్రయోజనాల కోసం వంటగ్యాస్‌ను వినియోగించేవారిపై

కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.100 పెంపు

న్యూఢిల్లీ : వ్యాపార ప్రయోజనాల కోసం వంటగ్యాస్‌ను వినియోగించేవారిపై భారం మరింత పెరిగింది. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్‌పై రూ.100.50 పెంచుతున్నట్లు నేషనల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో ఢిల్లీలో దీని ధర రూ.2,101కి చేరింది. నవంబరు 1న కూడా ఈ సిలిండర్ల ధరలను పెంచిన సంగతి తెలిసిందే. 


తాజా పెరుగుదల తర్వాత ప్రధాన నగరాల్లో కమర్షియల్ 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను పరిశీలించినపుడు, ఢిల్లీలో రూ.2,101; ముంబైలో రూ.2,051; కోల్‌కతాలో రూ.2,174.50; చెన్నైలో రూ.2,234.50కు చేరింది. పెరిగిన ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తాయి. 


నవంబరు 1న ప్రతి కమర్షియల్ ఎల్‌పీజీ 19 కేజీల సిలిండర్‌పైనా రూ.266 పెంచిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరను పెంచలేదు. 


Updated Date - 2021-12-01T19:11:47+05:30 IST