నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: డా.సుధాకర్‌

ABN , First Publish Date - 2020-04-08T23:32:35+05:30 IST

నర్సీపట్నం ఆస్పత్రిలో వసతులు, మాస్కుల కొరతపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని డాక్టర్ సుధాకర్‌ స్పష్టం చేశారు. తనను సస్పెండ్‌ చేయడంలో కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

నేను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: డా.సుధాకర్‌

విశాఖ: నర్సీపట్నం ఆస్పత్రిలో వసతులు, మాస్కుల కొరతపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని డాక్టర్ సుధాకర్‌ స్పష్టం చేశారు. తనను సస్పెండ్‌ చేయడంలో కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. పని పట్ల తన నిబద్ధత ఏంటో డాక్టర్లకు తెలుసని, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి అభివృద్ధికి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఎంతో ఎంతో కృషి చేశారని తెలిపారు. కొందరు కావాలని తనపై కక్షకట్టి ఆరోపణలు చేశారని సుధాకర్‌ దుయ్యబట్టారు.


మాస్కులు, తగిన రక్షణ సామగ్రి లేకుండా కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలు ఉన్న వారికి వైద్యం చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారంటూ డాక్టర్ సుధాకర్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ, ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఆయన చేసిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం లేపాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. సోమవారం సాయంత్రం మునిసిపల్‌ కార్యాలయంలో అధికారుల సమీక్షా సమావేశం జరుగుతున్న సమయంలో అక్కడకు వచ్చిన డాక్టర్‌ సుధాకర్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపైనా, వివిధ శాఖల ఉన్నతాధికారులపైనా తీవ్ర ఆరోపణలు చేశారు.



Updated Date - 2020-04-08T23:32:35+05:30 IST