పునాదులు తవ్వుతున్న దృశ్యం
ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్
నందిగాం, మే 17: నందిగాం మండలం నౌగాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రం సొంత భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈనెల 9న ‘ఆంధ్రజ్యోతి’లో ‘సొంతగూడు కరువై’ శీర్షికన వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మంగళవారం ప్రొక్లైన్‌తో పునాదుల తవ్వకాలు ప్రారంభించారు. ‘నాడు-నేడు’ కింద ఆర్‌అండ్‌బీ ఈ భవన నిర్మాణాన్ని చేపట్టనుంది. ఈ ఏడాది చివరి నాటికి భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఏఈ సతీష్ తెలిపారు.