అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి

ABN , First Publish Date - 2021-01-24T05:10:10+05:30 IST

అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతిగా భారత సైన్యాన్ని నడిపిన ధీరుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కొనియడారు.

అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతి
మైదుకూరులో ర్యాలీ చేపట్టిన విద్యార్థిని విద్యార్థులు

నివాళులర్పించిన పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిలో వక్తలు

వేంపల్లె, జనవరి 23: అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ దళపతిగా భారత సైన్యాన్ని నడిపిన ధీరుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి కొనియడారు.  వేంపల్లెలో స్వగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్య్ర సమరయోధుల్లో అగ్రగణ్యుడని కొని యాడారు.

నేతాజీ 1938, 1939లలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారన్నారు. ఆయన జీవితమం తా భరతమాత దాస్యశృంఖలాలను విడిపించేందుకు పాటుపడ్డారన్నారు. కార్యక్ర మంలో ఎనఎస్‌యూఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధ్రువకుమార్‌ రెడ్డి, నేతలు బాబు, కృష్ణారెడ్డి, నాగసుబ్బరెడ్డి, నరసింహారెడ్డి, ఉత్తన్న, సుబ్బరాయుడు, సత్తార్‌ పాల్గొన్నారు.

బద్వేలులో....

బద్వేలు, జనవరి 23: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా రాచపూడి నాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాలలో ఎనసీసీ, ఆర్మీ, నేవీ, కేడర్‌ విద్యార్థుల ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికి నివాళులర్పించారు. కళాశాల పరిపాలనాధికారి ఆర్‌వీసాయిక్రిష్ణ మాట్లాడుతూ నేతాజీ సుభా్‌ష చంద్రబోస్‌ గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, బా ల ఓబులేసు, సుధాకర్‌ పాల్గొన్నారు. బిజివేముల వీరారెడ్డి డిగ్రీ, పీజీ కళాశాల, ఎనఎ్‌సఎ్‌స ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో మహనీయుడు బోస్‌ జయంతిని నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, ఎనఎ్‌సఎ్‌స సమన్వయ అధికారి వెంకటరావు పాల్గొన్నారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యపీఠం ఆధ్వర్యంలో అధ్యక్షుడు గానుగపెంట నరసింహులు, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో  సంఘం అధ్యక్షుడు రామారెడ్డి, మొల్ల సాహి త్య పీఠ వ్యవస్థాపక అధ్యక్షుడు గానుగపెంట హనుమంతరావు ఆధ్వర్యంలో నేతాజీ జయంతిని నిర్వహించారు. 

మైదుకూరులో....

మైదుకూరు, జనవరి 23: ఆజాద్‌ హిం ద్‌ ఫౌజు ఉద్యమనేత సుభాష్‌ చంద్ర బోస్‌ జయంతి వేడుకలు మైదుకూరు లో ఘనంగా నిర్వహించారు. స్థానిక టీవీఎస్‌ఎం హైస్కూల్‌ విద్యార్థులు గోస వాయిద్యాలతో నేతాజీ చిత్రపటం చేతపట్టుకుని భారత్‌ మాతాకి జై అంటూ నినాదాలు చేస్తూ పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు.

రాయల్‌ కూడలిలో మానవహారం చేపట్టారు. కార్యక్రమం లో బాలశివ డిగ్రీ కళాశాల, మేధాకాలే జ్‌, వీఆర్‌ కాలేజ్‌ విద్యార్థినీ, విద్యార్థు లు, నాయకులు కామనూరు శ్రీనివాసులు, టి వెంకటేశ్వర్లు, భూమిరెడ్డి రవికళ్యాణ్‌, పందిటి పెద్దయ్య పాల్గొన్నారు. 

బి.మఠంలో....

బ్రహ్మంగారిమఠం, జనవరి 23: జిల్లా పరిష త ఉన్నత పాఠశాలలో నేతాజీ సుభాష్‌ చం ద్రబోస్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ వెంగమునిరెడ్డి విద్యార్థులకు నేతాజీ  గురించి వివరించారు. అంతకుముందు నేతాజీ చిత్రపటానికి ఎంపీఈఓ పూలమాల వేశారు.  కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T05:10:10+05:30 IST