Abn logo
Feb 19 2020 @ 23:22PM

డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నారు!

‘‘ప్రచార చిత్రాలు చూశా. ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ‘రాహు’ టైటిల్‌ ఆలోచింపజేసే విధంగా ఉంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వస్తున్నారు. సినిమా హిట్‌ అవ్వాలి’’ అని జీవితా రాజశేఖర్‌ అన్నారు. అభిరామ్‌ వర్మ, కృతి గార్గ్‌ జంటగా, ‘కాలకేయ’ ప్రభాకర్‌, ‘సత్యం’ రాజేశ్‌, ‘చలాకీ’ చంటి, గిరిధర్‌, స్వప్నిక ప్రధాన తారలుగా నటించిన చిత్రం ‘రాహు’. సుబ్బు వేదుల దర్శకత్వం వహించడంతో పాటు ఏవీఆర్‌ స్వామి, శ్రీశక్తి బాబ్జి, రాజా దేవరకొండతో కలిసి నిర్మించారు. ఈ నెల 28న సినిమా విడుదల కానుంది. మంగళవారం హైదరాబాద్‌లో మ్యూజిక్‌ సక్సెస్‌మీట్‌ నిర్వహించారు. ‘‘ప్రవీణ్‌ లక్కరాజు మంచి పాటలు ఇచ్చారు. ఇప్పటివరకూ విడుదలైనవన్నీ శ్రోతలను ఆకట్టుకున్నాయి. త్వరలో మిగతా రెండు పాటలను విడుదల చేస్తాం’’ అని సుబ్బు వేదుల అన్నారు. ‘‘న్యూ ఏజ్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. కొత్తవారితో తీశాం. సినిమా సక్సెస్‌మీట్‌లో ప్రేక్షకులను కలుస్తాం’’ అని ఏవీఆర్‌ స్వామి అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement