కమ్మేస్తున్న కంపచెట్లు

ABN , First Publish Date - 2022-06-20T05:07:44+05:30 IST

కమ్మేస్తున్న కంపచెట్లు

కమ్మేస్తున్న కంపచెట్లు
కొడంగల్‌ పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా కంపచెట్లు


  • కొడంగల్‌ పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన చెట్లు 
  • తరచూ ప్రమాదాలు

కొడంగల్‌ రూరల్‌/ పెద్దేముల్‌, జూన్‌ 19: కొడంగల్‌ పెద్ద చెరువు కట్టకు ఇరువైపులా ఉన్న కంపచెట్లు ప్రమాదకరంగా మారాయి.. చెరువుకట్టపై నుంచి  బైక్‌లు, ఆటోలపై పాత కొడంగల్‌ తండాకు వెళ్తుంటారు. ఈ క్రమంలో చెరువు కట్టకు ఇరువైపులా కంపచెట్లు పెరిగి రోడ్డును కమ్మేస్తున్నాయి. ఈ దారి గుండా పోయే వాహనదారులకు ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చెరువు కట్టకు ఇరువైపులా ఉన్న కంప చెట్లను తొలగించాలని కోరుతున్నారు. కాగా పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామం నుంచి మండలకేంద్రానికి వెళ్లే రోడ్డు పంచాయతీరాజ్‌ పరిధిలో ఉంది. ఈ ఈ రోడ్డు మార్గంలో పెద్ద చెరువు వద్ద నుంచి బండపల్లి గేటు వరకు ముళ్ల పొదలు రోడ్డుకు ఇరువైపులా బాగా పెరిగిపోయాయి. పెరిగిన ముళ్లపొదలను తొలగించకపోవడంతో రహదారిని మూసేస్తున్నాయి. అలాగే మంబచెరువు అలుగు సమీపంలో నుంచి జనగాం వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డుపై కూడా ముళ్లపొదలు రోడ్డు అడ్డంగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో పాటు రెండు వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఎదురుగా వచ్చే వాహనం వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే ముళ్ల కంప గీరుకుపోయి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎదురుగా కారువచ్చినా దారి ఇవ్వలేని పరిస్థితులు ఉండడంతో ఒక్కోసారి వాహనదారులు గొడవలకు దిగుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే మంబాపూర్‌-జనగాం, మంబాపూర్‌-పెద్దేముల్‌ రహదారుల్లో  ముళ్లపొదలను తొలగించాలని మండల ప్రజలు కోరతున్నారు. 

Updated Date - 2022-06-20T05:07:44+05:30 IST