త్వరలో ‘ఒకే దేశం-ఒకే డయాలసిస్‌’

ABN , First Publish Date - 2022-06-27T09:13:53+05:30 IST

త్వరలో ‘ఒకే దేశం-ఒకే డయాలసిస్‌’ పథకాన్ని ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ మన్సుక్‌ మాండవీయ ప్రకటించారు.

త్వరలో ‘ఒకే దేశం-ఒకే డయాలసిస్‌’

కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్‌ మాండవీయ

చెన్నై, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): త్వరలో ‘ఒకే దేశం-ఒకే డయాలసిస్‌’ పథకాన్ని ప్రారంభిస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ మన్సుక్‌ మాండవీయ ప్రకటించారు. ఈ పథకంతో బాధితులు దేశంలో ఎక్కడైనా డయాలసిస్‌ చేయించుకునేందుకు వీలుంటుందన్నారు. ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు చెన్నై లో జరిగిన సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న కేంద్రమంత్రి ఓ ప్రభుత్వ మల్టీసూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోబోటిక్‌ శస్త్రచికిత్సా కేంద్రాన్ని పరిశీలించారు. శిక్షణలో గాయపడి చికిత్స పొందుతున్న క్రీడాకారులు సింధు, మారియమ్మ, బాలాజీలను పరామర్శించారు. ఆస్పత్రి ప్రాంగణంలో జరిగిన చర్చావేదికలో మాట్లాడుతూ.. వైద్యరంగానికి ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశంలో అన్ని ప్రాం తాల్లో మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తున్నారన్నారు. 2030 నాటికి మలేరియా రహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు.

Updated Date - 2022-06-27T09:13:53+05:30 IST