నేటి నుంచి 20 రోజుల పాటు ఆకాశవీధిలో తోకచుక్క

ABN , First Publish Date - 2020-07-14T07:21:44+05:30 IST

ఇప్పుడు చూడకుంటే.. మరో ఆరు వేల ఏళ్ల తర్వాతే కనిపిస్తా అం టోంది తోకచుక్క నియోవైజ్‌ (సీ/2020 ఎఫ్‌ 3)!! ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ తోకచుక్క మంగళవారం(జూలై 14) నుంచి 20 రోజుల పాటు ఆకాశ వీధిలో...

నేటి నుంచి 20 రోజుల పాటు ఆకాశవీధిలో తోకచుక్క

  • ఇప్పుడు చూడకుంటే.. మళ్లీ కనిపించేది 8,786లోనే  


న్యూఢిల్లీ, జూలై13: ఇప్పుడు చూడకుంటే.. మరో ఆరు వేల ఏళ్ల తర్వాతే కనిపిస్తా అం టోంది తోకచుక్క నియోవైజ్‌ (సీ/2020 ఎఫ్‌ 3)!! ఐదు కిలోమీటర్ల వెడల్పు ఉండే ఈ భారీ తోకచుక్క మంగళవారం(జూలై 14) నుంచి 20 రోజుల పాటు ఆకాశ వీధిలో కనువిందు చేయనుంది. ఈ అరుదైన దృశ్యం మన దేశంలో స్పష్టంగా కనిపిస్తుందని.. సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాలు వాయ వ్య భాగంలో దీన్ని చూడొచ్చని ఒడిశాలోని పథనీ సమంతా ప్లానెటోరియం వెల్లడించింది. జూలై 22-23 తేదీల్లో భూమికి 103మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుందని, ఆ రోజు  మరింత స్పష్టతతో చూసే అవకాశం ఉంటుందని తెలిపింది. 


Updated Date - 2020-07-14T07:21:44+05:30 IST