Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 29 Jun 2022 00:10:04 IST

కామెడీ ప్లస్‌ హారర్‌

twitter-iconwatsapp-iconfb-icon

యశ్వంత్‌ ‘జబర్దస్త్‌’ రాజేశ్‌, అనన్య, హిందోళ చక్రవర్తి హీరోహీరోయిన్లుగా సీనియర్‌ దర్శకుడు రేలంగి నరసింహారావు రూపొందిస్తున్న చిత్రం ‘ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా’. తుమ్మల ప్రసన్నకుమార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో జరుగుతోంది. రేలంగి మాట్లాడుతూ ‘నిర్మాత ప్రసన్నగారు పిలిచి ఈ సినిమా చేస్తారా అని అడిగారు. సరేనన్నాను. ఇప్పటివరకూ నేను చేసిన కామెడీ సినిమాలకు భిన్నంగా ఉండే చిత్రం ఇది. కామెడీతో కూడిన హారర్‌ చిత్రం. జులై చివరి వారంలో విడుదల చేస్తాం’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ ‘ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన దర్శకుడు రేలంగిగారు ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమా తీస్తున్నారు. డి.ఓ.పి.శంకర్‌గారు అద్భుతమైన పనితనం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని తెలిపారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement