Abn logo
Mar 28 2020 @ 22:26PM

కన్నీళ్లతో వేడుకున్న కమెడియన్

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకూ ఉదృత రూపం దాల్చుతుంది. దీని దెబ్బకి ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఇక రాష్ట్రాల సంగతి చెప్పనవసరం లేదు. మందు కనిపెట్టని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొవాలా? అని ప్రభుత్వాలన్నీ ఇప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తున్నాయి. ఇలాంటి సందర్భాలలో ప్రభుత్వాలు చెబుతున్న సలహాలు పాటించడం తప్ప, చేసేది ఏమీ లేదు. జాగ్రత్తగా ఇంటిపట్టునే ఉండండి. మాస్క్‌లు ధరించండి. సామాజిక దూరం పాటించండి. ఎవరూ రోడ్లపైకి రావద్దు.. ఎవరు చెప్పినా ఈ జాగ్రత్తలే. అయితే ఇవే సూచనలు ఇప్పుడో కమెడియన్ కన్నీళ్లు పెట్టుకుని మరీ వేడుకుంటూ తెలిపారు. ఇంతకీ ఆ కమెడియన్ ఎవరు అనుకుంటున్నారు కదా..? ఇంకెవరు.. ఒకప్పుడు కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వడివేలు.


‘‘ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఏనాడూ ఊహించలేదు. చాలా మనోవేదనకి గురవుతున్నా. మనకే ఇలా ఉంటే.. ఇక డాక్టర్లు, నర్సులు వారి ప్రాణాలను పణంగా పెట్టి ఈ మహమ్మారిపై పోరాటం చేస్తున్నారు. మనల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా చాలా చోట్ల చేతులు జోడించి వేడుకోవడం చూశాను. దయచేసి గమనించండి వారు పోరాడుతున్నది మన కోసం, మన ముందు తరాల కోసం. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వాలు చెప్పింది విని, ఇంటిపట్టునే ఉందాం. ప్రభుత్వ సూచనలని ఎవరూ తేలికగా తీసుకోవద్దు. ఎవరూ బయటికి రావద్దు. పిల్లా పాపలతో హాయిగా ఇంట్లోనే ఉండండి అని వేడుకుంటున్నాను..’’ అని చెబుతూ వడివేలు కన్నీటి పర్యంతమయ్యారు.



Advertisement
Advertisement
Advertisement