Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 18 Aug 2022 19:41:24 IST

K Raghavendra Rao: దర్శకేంద్రుడిపై ఆ హీరో ఫ్యాన్స్ ఆగ్రహం

twitter-iconwatsapp-iconfb-icon

దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao).. పరిచయం అక్కరలేని పేరు. ఎన్నో బ్లాక్‌బస్టర్ విజయాలని అందించి.. టాలీవుడ్ ప్రతిష్టను పెంచిన దర్శకుడిగా పేరొందిన రాఘవేంద్రుడు.. కొన్నాళ్లుగా డైరెక్షన్ పక్కనెట్టి.. పర్యవేక్షణ జాబ్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘వాంటెడ్ పండుగాడ్’ (Wanted PanduGod) చిత్రం ఆగస్ట్ 19న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో.. ఈ చిత్రంలో మెయిన్ హీరోగా నటించిన జబర్ధస్త్ ఫేమ్ సుధీర్ (Sudheer) అభిమానులపై దర్శకేంద్రుడు ఫైర్ అయ్యారు.


‘జబర్ధస్త్’, ‘ఢీ’ వంటి కార్యక్రమాలతో సుధీర్ క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిపోయిందో చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక మీడియం రేంజ్ హీరోకి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడతనికి ఉంది. కమెడియన్‌గానే కాకుండా.. ఇప్పుడు హీరోగానూ సినిమాలు చేస్తూ.. అటు బుల్లితెర, ఇటు వెండితెర అన్నట్లుగా సుధీర్ ప్రయాణం సాగుతోంది. అదలా ఉంటే, ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకు సుధీర్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సుధీర్ పేర్ వినబడిన ప్రతిసారీ ఒకటే ఈలలు, గోలలతో స్టేడియం అదిరిపోయింది. ఇంతకు ముందు పవన్ కల్యాణ్ పేరు వినబడితే ఎలాంటి సౌండ్ వచ్చేదో.. అలా సుధీర్ అభిమానులు గోలగోల చేశారు. అయితే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాట్లాడుతున్నప్పుడు కూడా.. సుధీర్ అభిమానులు అదే విధంగా గోల చేస్తూ.. ఆయన స్పీచ్‌కు అడ్డు తగలడంతో.. ‘చిన్నా పెద్దా అనే తేడా లేదా? పిచ్చిపిచ్చిగా ఉందా? ఇలాగే చేస్తే అందర్నీ బయటికి పంపించేస్తాను.. ఎవరు పిలిచారు వాళ్లని..’ అంటూ దర్శకేంద్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి ఇది ప్రతి సినిమా ఫంక్షన్‌లో జరిగేదే. అయితే దర్శకేంద్రుడు మాత్రం అభిమానులు చేస్తున్న ఆ గోలకి ఒకింత అసహనానికి గురయ్యారు. అందుకే అలా మాట్లాడేశారు. 


అయితే.. దర్శకేంద్రుడు రియాక్ట్ అయిన తీరుపై.. ఇప్పుడు ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆయనని ట్రోల్ చేస్తున్నారు. సుధీర్ కాకుండా ఏ స్టార్ హీరో అయినా అయితే.. అప్పుడు అభిమానులు ఇలా గోల చేస్తే.. అప్పుడు కూడా దర్శకేంద్రుడు ఇలాగే మాట్లాడతారా? అంటూ సోషల్ మీడియా వేదికగా రాఘవేంద్రుడిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఈ గోలతో ఇప్పుడు ‘వాంటెడ్ పండుగాడ్’ సినిమా కూడా వార్తలలో నిలుస్తుండటం విశేషం.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement