క్లీన్‌చిట్‌తో వస్తా... రాజకీయాల్లో చేరుతా

ABN , First Publish Date - 2022-08-18T09:42:03+05:30 IST

క్యాసినో కేసులో క్లీన్‌చిట్‌తో బయట పడతానని.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరతానని చీకోటి ప్రవీణ్‌ చెప్పారు.

క్లీన్‌చిట్‌తో వస్తా... రాజకీయాల్లో చేరుతా

ఈడీకీ రాజకీయ నేతలపేర్లు చెప్పాలని బెదిరిస్తున్నారు

చంపేస్తామని భయపెడుతున్నారు

అన్ని పార్టీల నేతలూ క్యాసినో ఆడతారు

అది సరదా కోసమే: చీకోటి ప్రవీణ్‌


హైదరాబాద్‌/సైదాబాద్‌ ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి : క్యాసినో కేసులో క్లీన్‌చిట్‌తో బయట పడతానని.. ఆ తర్వాత రాజకీయాల్లో చేరతానని చీకోటి ప్రవీణ్‌ చెప్పారు. క్యాసినో కేసులో ఈడీకి రాజకీయ నాయకుల పేర్లు చెప్పాలని గుర్తు తెలియని అగంతకులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని, హిట్‌ మ్యాన్‌ అనే సుపారీ యాప్‌లో డబ్బులు ఇచ్చామని బెదిరిస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఏపీ అధికార పార్టీకి చెందిన నాయకుల పేర్లు చెప్పాలని బెదిరిస్త్తున్నారన్నారు. తనకు వస్తున్న బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు పిర్యాదు చేశాననాన్నరు. క్యాసినోకు వివిధ పార్టీలకు చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు వచ్చారని, సినీ తారలకు ప్రచారానికి డబ్బులు చెల్లించిన మాట వాస్తవమే అయినా... బయట ప్రచారం జరుగుతున్న పెద్దమొత్తంలో చెల్లించలేదన్నారు. చినజీయర్‌ స్వామికి తనకు మధ్య గురుశిష్యుల బంధం మాత్రమే ఉందని ప్రవీణ్‌ చెప్పారు. తనకు పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులతో సంబంధాలు ఉన్నాయని, అయితే ఆర్థికపరమైన సంబంధాలు కాదని స్పష్టం చేశారు. వల్లభనేని వంశీ మంచి స్నేహితుడని, నానితో పరిచయం ఉందని అయితే ఆర్థికపరమైన లావాదేవీలు లేవన్నారు. గ్యాంబ్లింగ్‌లో టీఆర్‌ఎస్‌, టీడీపీ, కాంగ్రెస్‌, వైసీపీ నేతలంతా ఆడతారని, అది సరదా అని, ప్రైవేట్‌ లైఫ్‌ అని ప్రవీణ్‌ చెప్పుకొచ్చారు. చట్టబద్ధంగా నిర్వహిస్తున్నాను కాబట్టి ఈడీ విచారణ తర్వాతా క్యాసినో కొనసాగిస్తానని వెల్లడించారు.

Updated Date - 2022-08-18T09:42:03+05:30 IST