Abn logo
Jul 30 2021 @ 23:40PM

బాలాజీ విగ్రహ ప్రతిష్ఠాపనకు రండి

సీఎంకు ఆహ్వానపత్రికను అందజేస్తున్న బాలాజీ ఆలయ కమిటీ సభ్యులు

 సీఎం కేసీఆర్‌కు ఆలయ కమిటీ ఆహ్వానం


హైదరాబాద్‌, జూలై 30 (ఆంధ్రజ్యోతి): దుబ్బాకలో నిర్మించిన బాలాజీ ఆలయ విగ్రహ ప్రతిష్ఠాపనకు హాజరుకావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఆలయ చైౖర్మన్‌ వడ్లకొండ శ్రీధర్‌, ఆలయ కమిటీ సభ్యులు ప్రగతిభవన్‌లో శుక్రవారం కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఆగస్టు 20న జరిగే విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరుకావాలని వారు సీఎం కేసీఆర్‌ను కోరారు. అంతకు ముందు సభ్యులు మంత్రి హరీశ్‌రావును, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని, ఎమ్మెల్యే రఘునందన్‌రావును ఆహ్వానించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను మంత్రి, ఎంపీ కలిసి సీఎం వద్దకు తీసుకెళ్లారు.