రమ్మన్నారు...పొమ్మన్నారు !

ABN , First Publish Date - 2020-05-30T10:08:01+05:30 IST

లాక్‌డౌన్‌, కొవిడ్‌ - 19 వేళ సమీక్షకు రమ్మని, వెంటనే రద్దు చేయడంపై ప్ర ధానోపాధ్యాయులు తీవ్ర

రమ్మన్నారు...పొమ్మన్నారు !

లాక్‌డౌన్‌ వేళ హెచ్‌ఎంలతో వీసీ

5.30 గంటలకు వస్తే...7 గంటలకు రద్దు అని సమాచారం 

ఉన్నతాధికారుల తీరుపై హెచ్‌ఎంల అసహనం


 అనంతపురం విద్య, మే, 29 : లాక్‌డౌన్‌, కొవిడ్‌ - 19 వేళ సమీక్షకు రమ్మని, వెంటనే రద్దు చేయడంపై ప్ర ధానోపాధ్యాయులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాడు-నేడు పనుల్లో నెలకొన్న అలసత్వం, ఉత్తర్వుల విడు దలలో అస్పష్టతపై ‘ఆంరఽధజ్యోతి’లో మొక్కు‘బడి’ మాటలు  శీర్షికన శుక్రవారం కథనం ప్రచురితమైంది. దీంతో జిల్లా కలెక్టర్‌, డీఈఓ నాడు-నేడు పనులు జరిగే 1271 స్కూళ్ల ప్రధానోపాధ్యాయులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించాల నుకున్నారు. దీంతో ఎమ్మార్సీల్లో కూర్చుని వీసీ చూడాలని చెప్పారు. జిల్లా కేంద్రంలోని పెన్నార్‌ భవన్‌కు అనంతపు రం సమీపంలోని మండలాల నుంచి నాడు-నేడు స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు హాజరయ్యారు. 


సాయంత్రం 5.30 గంటలకు వీసీ ఉంటుందంటూ సుమారు 200 మంది వరకూ హెచ్‌ఎంలు పెన్నార్‌ భవన్‌కు వచ్చారు. కొందరు మహిళా హెచ్‌ఎంలు ఆటోలు, ఇతర వాహనాల్లో ఇబ్బం దులు పడుతూ చేరుకున్నారు. అయితే సుమారు 7 గం టల ప్రాంతంలో వీసీ రద్దు చేసినట్లు సమాచారం చేర వేశారు. వీసీకి రమ్మనడం, ఉన్నఫలంగా పొమ్మనడం ఏంటని పలువురు హెచ్‌ఎంలు అసహనం వ్యక్తం చేశారు.  అధికారుల అనాలోచిత నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అపసోపాలు పడుతూ ఇళ్ల వెళ్లిపోయారు.

Updated Date - 2020-05-30T10:08:01+05:30 IST