రండి.. ప్రభుత్వ కళాశాలల్లో చేరండి

ABN , First Publish Date - 2022-06-25T06:56:57+05:30 IST

జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు నడుం బిగించారు.

రండి.. ప్రభుత్వ కళాశాలల్లో చేరండి
అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తున్న అధ్యాపకులు


- జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రచారం 

- విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ముందుకు  

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌, జూన్‌ 24: జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల్లో ప్రవేశాలు పెంచేందుకు అధ్యాపకులు నడుం బిగించారు. పదోతరగతి ఫలితాలకు ముందే ‘రండి.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చేరండి’ అంటూ ప్రచారం ప్రారంభించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలతోపాటు విద్యాబోధనపై వివరిస్తున్నారు.   విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం గా ముందుకుసాగుతున్నారు.   పదోతరగతి ఫలితాలు రాకముందే ఆయా ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థుల వివరాలు సేకరించి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకా లు, నాణ్యమైన విద్య,  స్కాలర్‌షిప్‌, ల్యాబ్‌ల గురించి వివరిస్తున్నారు.  విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు.  జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు ప్రభుత్వ కళాశాల్లో చేరేందుకు ముందుకొ స్తున్నారని  జిల్లా అధికారులు చెబుతున్నారు.  

  - అడ్మిషన్‌ పోర్టల్‌  ఏర్పాటు 

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం  అడ్మిషన్‌ పోర్టల్‌ను ఏర్పాటు చేశారు. పదో తరగతి ఫలితాలు రాగానే పోర్టల్‌ను ప్రారంభించను న్నారు. దీంతోపాటు ఇప్పటికే విద్యార్థుల నుంచి  సేకరించిన వివరాల ఆధారంగా అధ్యాపకులు వారి వద్దకు వెళ్లి అడ్మిషన్లు తీసుకోనున్నారు. గత సంవత్సరం కంటే ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా అధ్యాపకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. 


ప్రభుత్వ కళాశాలల్లో సౌకర్యాలు

- సీహెచ్‌  మోహన్‌, జిల్లా ఇంటర్మీడియేట్‌ విద్యాధికారి

జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం.  అనుభవజ్ఞులైన అధ్యాపకులతో నాణ్యమమైన విద్యను అందిస్తున్నాం. ఉచిత విద్యతోపాటు ప్రభుత్వం నుంచి  వచ్చేస్కాలర్‌ షిప్‌ను పొందవచ్చు.   

Updated Date - 2022-06-25T06:56:57+05:30 IST