Advertisement
Advertisement
Abn logo
Advertisement

బిచ్చగాళ్లుగా వచ్చి.. దొంగతనాలకు పాల్పడి

- తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యం

- సెల్‌ ఐఎంఈఐ నెంబరు ద్వారా కేసు చేధించిన పోలీసులు

- ఒడిశాకు చెందిన భార్యాభర్తల అరెస్టు

సోంపేట, డిసెంబరు 1 : తాళం వేసి ఉన్న ఇళ్లే వారి లక్ష్యం. బిచ్చగాళ్ల అవతారంలో వస్తారు. వీధుల్లో చుట్టూ నిఘా వేస్తారు. తాళం వేసి ఉన్న ఇళ్ల వద్దకు వెళ్లి నిశితంగా పరిశీలిస్తారు. తాళం ఎక్కడ ఉందో.. గమనించి దొంగతనాలకు పాల్పడతారు. కొన్నాళ్లుగా సోంపేట, కంచిలి మండలాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ఒడిశాకు చెందిన భార్యాభర్తలు ఎట్టకేలకు సోంపేట పోలీసులకు చిక్కారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోంపేటలో డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి, ఇన్‌చార్జి సీఐ డీవీవీ సతీష్‌ బుధవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన రోహిణి నాయక్‌(22), తాహునాయక్‌(25) దంపతులు. సోంపేట, కంచిలి చుట్టు పక్కల ప్రాంతాల్లో బిచ్చమెత్తుకొని తిరుగుతూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసి కిటికీ పక్కన తాళం చెవులను దాచే ఇళ్లను గుర్తించి.. చోరీలు చేస్తుండేవారు. ఇటీవల జింకిభద్రలో ఓ ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు సెల్‌ఫోన్‌ చోరీ చేశారు. వీరిపై అనుమానం రావడంతో సోంపేటలో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. జింకిభద్రలో బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్‌ఫోన్‌కు సంబంధించి ఐఎంఈఐ నెంబరును కూడా  ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల వద్ద ఉన్న సెల్‌ ఐఎంఈఐ నెంబరు ఆధారంగా రోహిణి, తాహునాయక్‌లను బుధవారం సోంపేటలో పోలీసులు పట్టుకున్నారు. వీరిద్దరూ సోంపేట, కంచిలి మండలాల్లో మూడు చోట్ల  బంగారం దొంగతనం చేశారు. మార్చిలో జింకిభద్రలో 47 గ్రాముల వెండి, మొబైల్‌, అక్టోబరు 27న సిర్తలిలోని రెండిళ్లలో 67 గ్రాములు, 17 గ్రాముల బంగారం, అక్టోబరు 28న సోంపేటలో దొంగతనాలకు పాల్పడ్డారు. మొత్తం 231.63 గ్రాములు (20తులాలు) బంగారం, వెండి కలిపి రూ.5.65 లక్షల సొత్తును దొంగిలించారు. ఈ మొత్తాన్ని సంచిలోనే వేసుకొని తిరుగుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి వారిద్దరినీ అరెస్టు చేశారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లే సమయంలో తాళాలు ఇంటి పరిసరాల్లో ఉంచొద్దని డీఎస్పీ ఎం.శివరామిరెడ్డి స్థానికులకు సూచించారు. 

Advertisement
Advertisement