విద్యార్థుల అభీష్టంమేరకే సబ్జెక్టుల కాంబినేషన్‌

ABN , First Publish Date - 2021-03-05T11:47:30+05:30 IST

నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) మదర్సాలలో భగవద్గీత, రామాయణాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై కేంద్రం గురువారం వివరణ ఇచ్చింది. విద్యార్థుల అభీష్టంమేరకే

విద్యార్థుల అభీష్టంమేరకే సబ్జెక్టుల కాంబినేషన్‌

మదర్సాలలో  గీత, రామాయణాలపై కేంద్రం వివరణ


న్యూఢిల్లీ, మార్చి 4: నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) మదర్సాలలో భగవద్గీత, రామాయణాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెడుతున్నట్లు వచ్చిన మీడియా కథనాలపై కేంద్రం గురువారం వివరణ ఇచ్చింది. విద్యార్థుల అభీష్టంమేరకే సబ్జెక్టుల కాంబినేషన్‌ ఉంటుందని తెలిపింది. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం జాతీయ విద్యావిధానంలో భాగంగా తొలుత వంద మదర్సాలలోని 3, 5, 8 తరగతులలో పురాతన భారతీయ విజ్ఞానం, వారసత్వంపై ఎన్‌ఐఓఎస్‌ కొత్త పాఠ్యాంశాలను ప్రవేశపెట్టనుంది. మదర్సాలలో నాణ్యమైన విద్యను అందించాలన్న ప్రత్యేక నిబంధన కింద ఎన్‌ఐఓఎస్‌ వివిధ సబ్జెక్టుల కాంబినేషన్‌ను అందుబాటులో ఉంచుతుంది. వాటిలో తమకు కావలసిన సబ్జెక్టుల కాంబినేషన్‌ను ఎన్నుకునే స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుందని కేంద్రం పేర్కొంది. 

Updated Date - 2021-03-05T11:47:30+05:30 IST