Abn logo
Oct 20 2020 @ 04:30AM

కాంబినేషన్‌ రిపీట్‌!

Kaakateeya

రెండేళ్ల క్రితం రణ్‌వీర్‌సింగ్‌, రోహిత్‌ శెట్టి  కాంబినేషన్‌లో వచ్చిన ‘సింబా’ సినిమా భారీ విజయం సొంతం చేసుకుని బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే! అంతే కాదు రోహిత్‌ శెట్టి డైరెక్ట్‌ చేసిన ‘సూర్యవంశీ’ చిత్రంలో రణ్‌వీర్‌  అతిథి పాత్ర పోషించారు. మరోసారి ఈ కాంబినేషన్‌ రిపీట్‌ కానుంది. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ మరో సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి ‘సర్కస్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. షేక్‌స్పియర్‌ నవల ‘ది కామెడీ ఆఫ్‌ ఎర్రర్స్‌’ ఆధారంగా రూపొందనున్న చిత్రమిది. ఈ విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది. పూజా హెగ్డే, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌  రణ్‌వీర్‌ సరసన నాయికలుగా నటించబోతున్నారు.

Advertisement
Advertisement