కరోనాపై పోరుకు కంపెనీల ఖర్చు ఇకపై సీఎస్ఆర్ పద్దు కిందకు... తాజా మార్గదర్శకాలు జారీ...

ABN , First Publish Date - 2021-05-06T19:49:41+05:30 IST

కరోనాపై పోరాడే క్రమానికి సంబంధించిన వ్యయాన్ని కార్పొరేట్ సంస్థలు... ఇకపై కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్) కింద చూపవచ్చు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.

కరోనాపై పోరుకు కంపెనీల ఖర్చు ఇకపై సీఎస్ఆర్ పద్దు కిందకు... తాజా మార్గదర్శకాలు జారీ...

న్యూఢిల్లీ : కరోనాపై పోరాడే క్రమానికి సంబంధించిన వ్యయాన్ని కార్పొరేట్ సంస్థలు... ఇకపై కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ(సీఎస్‌ఆర్) కింద చూపవచ్చు. కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కరోనా నుండి రక్షణ కోసం ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, నిల్వ ప్లాంట్ల స్థాపన, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, సిలిండర్లు, ఇతర వైద్య పరికరాల తయారీ, సరఫరా అన్నీ కూడా సీఎస్‌ఆర్ కిందకు వస్తాయని తెలిపింది. కంపెనీస్ యాక్ట్ ప్రకారం రూ. 500 కోట్లు, అంతకుమించిన వ్యాపారం, లేదా రూ. వెయ్యి కోట్లు, అంతకుమించి టర్నోవర్ లేదా రూ. 5 కోట్లు లేదా అంతకుమించిన నెట్ ప్రాఫిట్ ఉన్నపక్షంలో... ఆయా సంస్థలు తమ నెట్ ప్రాఫిట్ లో రెండు శాతాన్ని సీఎస్‌ఆర్ కింద వ్యయం చేయాల్సి ఉంటుంది. 


తాజాగా కరోనా నేపధంలో రిలయన్స్ వంటి సంస్థలు ఆక్సిజన్ తయారీ, మరికొన్ని సంస్థలు ఇతర వైద్య పరికరాల తయారీలో ఉన్నాయి. ఇప్పుడు వీటిని సీఎస్‌ఆర్ కింద చూపించవచ్చు. కాగా, కరోనా వైరస్‌పై పోరాడేందుకు తమ వంతు నిధులతో ప్రభుత్వరంగ సంస్థలు ముందుకు రావాలని కేంద్రమంత్రి సదానందగౌడ పిలుపునిచ్చారు. అలాగే కరోనా బాధితుల చికిత్స కోసం తాత్కాలిక ఆసుపత్రులు, సంరక్షణా కేంద్రాల ఏర్పాటు కోసం వ్యయం చేసే నిధులను సీఎస్‌ఆర్ కింద పరిగణిస్తామని గత ఏప్రిల్‌లో కేంద్రం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి కొన్ని మార్పులు, చేర్పులతో కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. 


Updated Date - 2021-05-06T19:49:41+05:30 IST