ఇది కొలంబస్‌ ఇల్లు!

ABN , First Publish Date - 2020-07-28T05:30:00+05:30 IST

అమెరికాను ఎవరు కనుగొన్నారు? అంటే.. క్రిస్టోఫర్‌ కొలంబస్‌ అని ఠక్కున చెబుతారు! మరి ఆయన పుట్టింది ఎక్కడో తెలుసా? ఇటలీలోని జెనోవా అనే నగరంలో. ఈ చిత్రంలో కనిపిస్తున్న.....

ఇది కొలంబస్‌ ఇల్లు!

అమెరికాను ఎవరు కనుగొన్నారు? అంటే.. క్రిస్టోఫర్‌ కొలంబస్‌ అని ఠక్కున చెబుతారు! మరి ఆయన పుట్టింది ఎక్కడో తెలుసా? ఇటలీలోని జెనోవా అనే నగరంలో. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇంటిలోనే ఆయన పుట్టారు. ఇటుకలతో పురాతన భవనంలా కనిపిస్తున్న ఈ ఇంట్లోనే కొలంబస్‌ బాల్యం గడిచింది. 1455 సంవత్సరం నుంచి 1470 వరకు ఆయన ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ తరువాత ఆయన కుటుంబం అదే నగరంలో సావొనా ప్రాంతానికి మారింది. కొలంబస్‌ తండ్రి నేత పని చేసేవారు. చిన్నతనంలో కొలంబస్‌ పనిలో తండ్రికి సహాయపడేవాడట. 1684లో జరిగిన ఓ యుద్ధంలో ఇల్లు బాగా దెబ్బతింది. తరువాత 18వ శతాబ్దంలో ఇంటికి మరమ్మతులు చేశారు. ప్రస్తుతం ఈ ఇల్లు పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. 



Updated Date - 2020-07-28T05:30:00+05:30 IST