ఏటీఎం నుంచి రంగు పడిన నోటు వస్తే ఏం చేయాలి? రిటర్న్‌చేసేందుకు నిబంధనలేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-22T18:07:36+05:30 IST

ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసినప్పుడు ఒక్కోసారి...

ఏటీఎం నుంచి రంగు పడిన నోటు వస్తే ఏం చేయాలి? రిటర్న్‌చేసేందుకు నిబంధనలేమిటో తెలుసా?

ఏటీఎంలో డబ్బు విత్ డ్రా చేసినప్పుడు ఒక్కోసారి రంగునోట్లు, చిరిగిన నోట్లు బయటకు వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఏ బ్యాంకు కూడా రంగు నోట్లను స్వీకరించడానికి నిరాకరించదు. ప్రస్తుతం వినియోగదారులు నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎంలను ఉపయోగిస్తున్నారు. మీకు కావలసినప్పుడు మీరు ATM నుండి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు.  ATM నగదు ఉపసంహరణకు సురక్షితమైన పద్ధతిగా పరిగణిస్తున్నారు. అయితే వినియోగదారులు ఒక్కోసారి ATM నుండి డబ్బు విత్‌డ్రా చేసుకునేటప్పుడు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఏటీఎంలో డబ్బులు తీసుకున్న తర్వాత తమకు రంగుల మరకలు కలిగిన నోటు వచ్చిందని, అది మార్కెట్‌లో నడవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటీవల ఒక కస్టమర్ ఈ పరిస్థితి గురించి ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశాడు. SBI  అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌ను ట్యాగ్ చేశాడు. 




ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేయగా.. రంగులో ఉన్న 500 నోటు కనిపించిందని కస్టమర్ ఫిర్యాదు చేశాడు. దీనిపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పందిస్తూ.. ఇలాంటి నోట్లను ఏం చేయవచ్చో తెలియజేసింది. అయితే.. బ్యాంకు ఏటీఎంల నుంచి అలాంటి నోట్లను విత్‌డ్రా చేయడం అసాధ్యమని కూడా బ్యాంకు తెలిపింది. SBI తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందిస్తూ.. ప్రియమైన కస్టమర్.. కరెన్సీ నోట్లను మా ATMలలో లోడ్ చేయడానికి ముందు అత్యాధునిక నోట్ సార్టింగ్ మెషీన్ల ద్వారా తనిఖీ చేస్తారు. అందువల్ల, చిరిగిన నోటు పంపిణీ చేయడం అసాధ్యం. అయితే మీరు ఈ నోట్లను మా బ్రాంచ్‌ల నుండి మార్పిడి చేసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ఏ బ్యాంకు కూడా రంగు నోట్లను స్వీకరించడానికి నిరాకరించదు. అయితే మురికిగా చేయవద్దని సూచించింది. మీ నోటు ఫేక్ కాకపోతే కచ్చితంగా మార్చుకోవచ్చని ఆర్బీఐ చెబుతోంది. పాత, చిరిగిన నోట్లను సులభంగా మార్చుకోవచ్చు. దీని కోసం మీకు ఎటువంటి రుసుము వసూలు చేయరు. కానీ కాలిపోయిన లేదా చాలా దారుణంగా చిరిగిపోయిన నోట్లు తీసుకోరు. మీరు ఉద్దేశపూర్వకంగా నోటును చింపినట్లు లేదా కత్తిరించినట్లు బ్యాంక్ అధికారి భావిస్తే, వారు మీ నోటును మార్చుకోవడానికి నిరాకరించవచ్చు. నోటు తిరిగి తీసుకునే ముందు ఆ నోటు ఎంత ఎంత చిరిగిపోయిందనే దానిపై ఆధారపడి ఉంటుంది. 2000 రూపాయల నోటు 88 చదరపు సెంటీమీటర్ (CM) ఉంటే, మీకు పూర్తి డబ్బు వస్తుంది. కానీ 44 చదరపు సెం.మీ. ఉంటే సగం ధర మాత్రమే ఇస్తారు. అలాగే 200 రూపాయల చిరిగిన నోటులో 78 చదరపు సీ.ఎం.ఉంటే పూర్తిగా డబ్బు వస్తుంది కానీ 39 చదరపు సీ.ఎం, ఉంటే సగం డబ్బు మాత్రమే వస్తుంది.

Updated Date - 2022-02-22T18:07:36+05:30 IST