Abn logo
Aug 5 2020 @ 17:55PM

‘కలర్ ఫోటో’ టీజర్ విడుదల చేసిన విజయ్ దేవరకొండ

‘హృదయ కాలేయం, కొబ్బరి మట్ట’ లాంటి స్పూఫ్ చిత్రాలను అందించిన అమృత ప్రొడక్షన్స్ నుంచి ‘కలర్ ఫోటో’ అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ‘మజిలీ, డియర్ కామ్రేడ్, ప్రతిరోజు పండగే’ వంటి చిత్రాల్లో తనదైన కామెడీతో ఆకట్టుకున్న సుహాస్ ఈ సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్నారు. చాందిని చౌదరీ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సునీల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర టీజర్ తాజాగా విడులైంది. ప్రముఖ హీరో విజయ దేవరకొండ ‘కలర్ ఫోటో’ టీజర్‌ని ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. సందీప్ రాజ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అబ్బాయి కాల భైరవ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. 


Advertisement
Advertisement
Advertisement