Abn logo
Aug 11 2020 @ 04:27AM

సినిమా షూటింగ్‌లకు పంచదార్ల అనుకూలం

 ‘కలర్‌ ఫొటో’ సినిమా నిర్మాత గంగాధర్‌


రాంబిల్లి, ఆగస్టు 10 : సినిమా షూటింగ్‌లకు పంచదార్ల పుణ్యక్షేత్ర ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉందని  మెగాస్టార్‌ చిరంజీవి మేనేజర్‌, కలర్‌ ఫొటో సినిమా నిర్మాత ఎన్‌.ఎస్‌.గంగాధర్‌ అన్నారు. సోమవారం ప్రముఖ శైవక్షేత్రమైన పంచదార్లలోని ఉమాధర్మలింగేశ్వర స్వామిని లాలం చందుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.


అనంతరం ఆయన మాట్లాడుతూ రాధామాధవస్వామి ఆలయ గర్భంలో పుణ్యధార, ఫణిగిరి తనను ఆకట్టుకుందని అన్నారు. ఇక్కడ ఆధ్యాత్మిక, ఆహ్లాద వాతావరణం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తుందన్నారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయాలను దర్శించుకోవడం తన అదృష్టమన్నారు. ఆయనతోపాటు రామ్‌చరణ్‌ యూత్‌ రాష్ట్ర నాయకులు లాలం చందు, జనసేన నేత కట్టెంపూడి సతీష్‌, రుత్తల మాధవ, నాని, రాంబాబు, టీడీపీ మండల అధ్యక్షుడు వి.దిన్‌బాబు తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement